CM Revanth Reddy: కేసీఆర్ ధన దాహానికి ‘కాళేశ్వరం’ బలి.. ఆ వీడియో పోస్ట్ చేసిన రేవంత్

CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సులో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కోసం బయలుదేరిన వేళ ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘కేసీఆర్ రూ. 97 వేల కోట్ల వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు’’ అని రేవంత్ […]

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సులో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కోసం బయలుదేరిన వేళ ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘కేసీఆర్ రూ. 97 వేల కోట్ల వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు’’ అని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నాఎందుకు  నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఇక మరమ్మతులకు పనికి రాదు.. పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందే అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిన విషయాన్ని రేవంత్(CM Revanth Reddy) ఈసందర్భంగా గుర్తుచేశారు.

We’re now on WhatsApp. Click to Join

తాము మేడిగడ్డ విజిట్‌కు ఆహ్వానించినా.. బీఆర్ఎస్‌తో పాటు వారి చీకటి మిత్రులు, బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఈ విజిట్‌కు తాము ప్రభుత్వం తరఫున ఆహ్వానించామన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక నేపథ్యంలో అసలు వాస్తవాలను ఎమ్మెల్యేలు అందరూ తెలుసుకొని,  తెలంగాణ ప్రజలకు తెలపడమే  మేడిగడ్డ టూర్ ముఖ్య ఉద్దేశమని రేవంత్ స్పష్టం చేశారు.

Also Read : India – US – NPCI : గుడ్ న్యూస్.. భారత్ – అమెరికా బ్యాంకుల మధ్య ‘పేమెంట్’ సర్వీస్ ?

‘‘కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి బీజేపీ గల్లీ లీడర్ దాకా లొల్లి చేశారు. అలాంటి బీజేపీ నాయకులు మేడిగడ్డ ప్రాజెక్టు వాస్తవాలను చూడడానికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మరోవైపు ఉన్నాయని క్లియర్ అయిపోయింది’’ అని సీఎం విమర్శలు గుప్పించారు.  మేడిగడ్డ పర్యటన ద్వారా తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని తెలంగాణ సమాజం కళ్లారా చూడబోతోందన్నారు.

Also Read : Expensive Electric Cars : దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల విశేషాలివీ..

  Last Updated: 13 Feb 2024, 02:46 PM IST