Site icon HashtagU Telugu

CM Revanth – PM Modi : ప్రధాని మోడీ మా పెద్దన్న.. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోం: సీఎం రేవంత్

Cm Revanth Pm Modi

Cm Revanth Pm Modi

CM Revanth – PM Modi : ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా సోమవారం రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజకీయ వైరుధ్యాలకు భిన్నంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓకే వేదికను పంచుకున్నారు. ఇదే సభలో రాష్ట్రప్రథమ పౌరురాలు గవర్నర్‌ తమిళిసై కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా ముగ్గురు కలిసి 6,700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి జాతికి అంకితం చేశారు. ఆదిలాబాద్-బేల జాతీయరహదారి విస్తరణకు భూమిపూజ, అంబారి-ఆదిలాబాద్-పింపాల కట్టె రైల్వే లైన్‌ విద్యుదీకరణ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను ప్రధాని శ్రీకారం చుట్టారు. రాష్ట్రం గుండా పరుగులు పెట్టనున్న 3 వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఆ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజల తరపున మేం ఘన స్వాగతం పలికాం. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్నలాంటి వారు. కేంద్ర సర్కారుతో ఘర్షణలు సరికావు. తమ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ పెట్టుకోదలచుకోలేదు. ఘర్షణాత్మక వాతావరణం ఉంటే అభివృద్ధి వెనుకబడుతుంది. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు.. ఆ తర్వాత అంతా అభివృద్ధి గురించే చర్చలు ఉంటాయి.  మా వైపు నుంచి ఎటువంటి బేషజాలు ఉండవు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది పనుల గురించి చర్చించాం. వాటికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల, నిరంకుశ వైఖరి వల్ల  విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వెనుకబడింది’’ అని సీఎం రేవంత్ తెలిపారు.

Also Read : Lucky Zodiac Signs : ఒకేరోజు హోలీ, చంద్రగ్రహణం.. 4 రాశుల వారికి శుభాలు

‘‘కేంద్ర ప్రభుత్వంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్రం వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధి తగిన కార్యాచరణతో మేం ముందుకెళ్తాం. మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణను డెవలప్ చేయడానికి మీ (ప్రధాని) సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్‌ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది. కంటోన్మెంట్‌ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించినందుకు ప్రధాని మోడీ ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది’’ అని రేవంత్ చెప్పారు.

Also Read : Life Style: హైట్ తక్కువ అని ఫీల్ అవుతున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి

అనంతరం ప్రసంగించిన ప్రధాని మోడీ.. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆదిలాబాద్‌లో ప్రారంభించిన అభివృద్ధి పనులే దానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుందని మోడీ తెలిపారు.