CM Revanth Reddy : రేవంత్ మీద కుట్ర జరుగుతుందా..?

  • Written By:
  • Updated On - April 10, 2024 / 12:02 PM IST

సీఎం రేవంత్ (CM Revanth Reddy ) కొండగల్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తన ఇమేజ్ (Conspiracy Against Him To Damage Politically) ను తగ్గించే కుట్ర జరుగుతుందని..కొండగల్ లో తనను దెబ్బ తీయాలని చూస్తున్నారని, తనను రాజకీయంగా ఎదగనీయకుండా గోతులు తవ్వుతున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర ఎంతో ఉంది..అలాంటి ఆయన్ను పదేళ్ల పాటు అధికారంలో కూర్చోపెట్టారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని భావించి..బిఆర్ఎస్ ను అత్యధిక మెజార్టీ తో రెండుసార్లు అధికారంలో కూర్చుపెట్టారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రజలు అనుకున్న పూర్తిస్థాయిలో మేలు చేయలేకపోయారు. దీంతో ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దామని డిసైడ్ అయ్యి..రేవంత్ ను సీఎం పదవిలో కూర్చోపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం రేవంత్ తన మార్క్ పాలన కొనసాగిస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించి సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే బిఆర్ఎస్ , బిజెపి ని చిత్తూ చేసామో..ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా 17 కు 17 సాధించి రాష్ట్రంలో బిఆర్ఎస్ , బిజెపి అడ్రెస్ లేకుండా చేయాలనీ రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పుడు తన ఇమేజ్ ను తగ్గించాలనే కుట్ర చేస్తున్నట్లు స్వయంగా రేవంతే చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ కుట్ర చేస్తుంది..ప్రత్యర్థి పార్టీలా..లేక సొంత పార్టీ నేతలా అనేది అర్ధం కావడం లేదు. ముఖ్యంగా రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించి..రేవంత్ ఇమేజ్ తగ్గించాలని..ఈ సాకు చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ పాపులార్టీని తగ్గించాలని చూస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి వ్యూహాలు కూడా రచిస్తున్నారని..అధికార పార్టీకి చెందిన ఇద్దరు , ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థి DK అరుణ తో టచ్ లో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా అధికార పార్టీ నేతల అండదండలు ఉండడం తో అరుణ లో గెలుపు ధీమా ఎక్కువ అవుతుందని అంటున్నారు. మరి రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనీ ఎవరు చేస్తున్నారనేది అతి త్వరలోనే బయట పడబోతుందని రేవంత్ వర్గీయులు అంటున్నారు.

Read Also : female statues : విగ్రహాలపైనా లైంగిక వేధింపులు.. దారుణం వెలుగులోకి !?