Lok Sabha Elections : ‘చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటే’ ఏంలాభం కేసీఆర్..? – రేవంత్ రెడ్డి

కారు పని అయిపోయందని.. అందుకే కేసీఆర్ బస్సు వేసుకొని బయలుదేరాడని 'కేసీఆర్ బస్సు యాత్ర' ఫై ఎద్దేవా చేశారు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 09:09 PM IST

లోక్ సభ ఎన్నికల ప్రచారం (Lok Sabha Election Campaign)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటల తూటాలు వదులుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ (KCR) ఫై విమర్శల వర్షం కురిపిస్తూ..కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. వరుస పర్యటనలు చేస్తూ వెళ్తున్న రేవంత్..ఈరోజు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి (Chevella MP Candidate Ranjith Reddy) తరపున ప్రచారంలో పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు పని అయిపోయందని.. అందుకే కేసీఆర్ బస్సు వేసుకొని బయలుదేరాడని ‘కేసీఆర్ బస్సు యాత్ర’ ఫై ఎద్దేవా చేశారు. కేసీఆర్ అహంకారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి ఖతం చేశారని ..ఇప్పుడు ‘చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటే’ ఏంలాభం కేసీఆర్..? రేవంత్ సెటైర్ వేశారు. కేసీఆరే కాదు.. పదేళ్ల నుంచి ప్రధాని మోడీ కూడా దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడని ఆరోపించారు. మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పి నిండా ముంచాడని , ఒక్కరి ఖాతాలో కూడా రూ.15 లక్షలు వేయలేదని మండిపడ్దారు. పదేళ్లలో తెలంగాణకు మోడీ ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదని , నమో అంటే నమ్మించి మోసం చేయడం అని చెప్పుకొచ్చారు. కులగణనతో బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని చెప్పుకొచ్చారు.

‘RSS భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే. ఆరెస్సెస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోంది. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరెస్సెస్ కంకణం కట్టుకుంది. తమకి మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభం అని మోదీ అనుకుంటున్నాడు. మోదీ దేశాన్ని మోసం చేశాడు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also : Virat Kohli: దుమ్మురేపిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ లో చారిత్రక రికార్డు,  తొలి ఆటగాడిగా గుర్తింపు!