సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..నిన్నటి నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో (Flood Affected Areas) బిజీ బిజీ గా పర్యటిస్తున్నారు. నిన్న సోమవారం
ఖమ్మం (Khammam) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణ, ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం ప్రకటించారు. వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం ప్రకటించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ధైర్యం చెడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి హామీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు కూడా ఖమ్మం తో పాటు మహాబాబుబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఖమ్మంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని .. తాను ఫామ్ హౌస్ లో పడుకున్నోడిలా కాదని ..ప్రజల మధ్య ఉండేవాడిని అంటూ మాజీ సీఎం కేసీఆర్ ఫై పరోక్షంగా సెటైర్లు వేశారు. గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారని , ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే చేస్తామని ప్రకటించారు. మిషన్ కాకతీయ లోపభూయిష్టంగా జరిగిందని , అందుకే చెరువులు తెగిపోతున్నాయన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఇంజనీర్లతో చర్చిస్తున్నామన్నారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటుందని రేవంత్ అన్నారు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమెరికా పోయి (KTR) కూర్చున్నోడు తలకాయ లేకుండా మాట్లాడుతుండని విమర్శించారు. ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ ద్వారా జరిగిన నష్టాన్ని వివరించానని రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి న్యాయం చేయాలని ప్రధాని మోదీని వెళ్లి కలుస్తానన్నారు.
Read Also : E-Shram : కేవలం 3 సంవత్సరాలలో 30 కోట్ల మంది కార్మికులు నమోదు