Site icon HashtagU Telugu

Telangana : యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల‌తో సీఎం రేవంత్ స‌మీక్ష‌.. డ్ర‌గ్స్ ఫ్రీ తెలంగాణ ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని సూచ‌న‌

Congress

CM Revanth Reddy

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా, దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో దీనిపై సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్ ను నియమించడంతో పాటు ఆ విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయిం, చెలామణిని నిరోధించడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా “టీఎస్ నాబ్”ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్‌) బీ శివధర్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి హాజరయ్యారు.

Also Read:  AP : రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నాం : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య