CM Revanth : కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ తాపత్రయ పడ్డారు – సీఎం రేవంత్

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 01:55 PM IST

కేటీఆర్ (KTR) ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ (KCR) పై ఒత్తిడి చేశారు.. కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ ప్రధాని మోడీ (PM Modi)ని కోరారని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఆయన అన్నారు.

కేటీఆర్ ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ పై ఒత్తిడి చేసారని… కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ మోడీని కోరారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎంను మార్చాలనుకునే పార్టీ అంతర్గత వ్యవహారంలోనూ కేసీఆర్ మోడీ అనుమతి కోరారని చెప్పుకొచ్చారు. గతంలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి ఓటేస్తే..ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలను కేసీఆర్ సస్పెండ్ చేశారని రేవంత్ గుర్తు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ అండగా నిలిచిందన్నారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారు. సీఎంను మార్చుకునే విషయం కూడా మోడీ ఇక్కడే చెప్పారు. కేసీఆర్ మీకు కొన్ని చెబుతారు.. కొన్ని దాస్తారన్నారు.

రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి బంధం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఓడించిందని చెప్పుకొచ్చారు. సీఎంను మార్చుకోవాలంటే ఎవరి అనుమతి అవసరం లేదని.. బీఆర్ఎస్ కే గత ప్రభుత్వం హయాంలో 100 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉందని గుర్తు చేసారు.

Read Also : PV Narasimha Rao : పీవీకి భారతరత్న రావడం పట్ల కేసీఆర్ స్పందన