CM Revanth Reddy: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విదేశీ పర్యటనను సక్సెస్ ఫుల్ గా ముగించుకుని రాష్ట్రంలో అడుగుపెట్టిన రేవంత్ బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు. కాగా ఇవాళ కోకాపేట్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో రెండో అతిపెద్ద ఐటీ ఎంప్లాయర్ కాగ్నిజెంట్ తన కొత్త 10 లక్షల చదరపు అడుగుల క్యాంపస్‌కు బుధవారం శంకుస్థాపన చేయనుంది. 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త క్యాంపస్, కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డిజిటల్ ఇంజనీరింగ్ మరియు క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా అధునాతన సాంకేతికతలపై దృష్టి పెడుతుంది. కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న 10 రోజుల తర్వాత హైదరాబాద్‌లో సంస్థను విస్తరించే పనిని ప్రారంభించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ నెల 3న అంతర్జాతీయ పర్యటనకు శ్రీకారం చుట్టింది. దక్షిణ కొరియాకు వెళ్లే ముందు అమెరికాలో వారం రోజుల పాటు పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో వివిధ కంపెనీలు మరియు అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అవకాశాలు ఉంటాయో వారికి వివరించి, పెట్టుబడిదారులని ఆకర్షించారు. తెలంగాణలో ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో భాగస్వామ్యాలను సుస్థిరం చేశారు.
అమెరికా పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా కాగ్నిజెంట్‌తో కీలక ఒప్పందంతో సహా పలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు. అమెరికాలో ఉండగా ఈ నెల 5న కుదిరిన ఈ ఎంఓయూ హైదరాబాద్‌లోని కోకాపేటలో కొత్త కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు పునాది వేసింది.దీనికి త్వరలో శంకుస్థాపన జరగనుండగా, ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చూపే సానుకూల ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం ఆశాజనకంగా ఉంది.
Also Read: Rana Daggubati : ఆ యాప్‌లో తన భార్యని కలుసుకున్న రానా.. వారం రోజుల్లో పెళ్లి..