CM Revanth Reddy : ఎన్నికల ప్రచార ఘట్టం శనివారం సాయంత్రమే ముగిసింది. దీంతో నాయకులంతా రిలాక్స్ అవుతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లారు. వర్సిటీ విద్యార్థులతో కలిసి ఆయన సరదాగా ఫుట్ బాల్ ఆడారు. ఆట మధ్యలో షూ పాడైనా.. గేమ్ ఆపకుండా రేవంత్ కంటిన్యూ చేశారు. రేవంత్‌తో పాటు ఫుట్‌బాల్ ఆడిన వారిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ,టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ యూనిట్ ఇంఛార్జి అజయ్ ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
సీఎం రేవంత్‌కు ఇష్టమైన గేమ్ ఫుట్ బాల్ కావడంతో ఆయనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆడుతుంటారు. ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్ కోసం ఫుట్‌బాల్ ఆడుతూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తారు. 54 ఏళ్ల వయస్సులోనూ రేవంత్ రెడ్డి యువకులతో కలిసి పరుగులు తీస్తూ ఉత్సాహంగా ఫుట్ బాల్ ఆడి.. వారిలో ఉత్సాహాన్ని నింపారు. రేవంత్ ఆటను చూసిన పలువురు ఆయన్ను అభినందించారు.
Also Read :Telugu Students : విహార యాత్రలో విషాదం.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
హెచ్‌సీయూలో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నవారంతా ప్రత్యేకమైన జెర్సీలు ధరించారు. వాటిపై ‘ఇండియా’ టీమ్ అని రాసి ఉంది. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి పేరు కూడా ‘ఇండియా’నే. ప్రతీ జెర్సీపై ఆయా ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. ఇక ఈ సరదా మ్యాచ్ జరిగిన గ్రౌండ్ చుట్టూ మువ్వన్నెల ఇండియా ఫ్లాగ్‌ను కూడా కట్టారు. మొత్తం మీద శనివారం సాయంత్రం దాకా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన సీఎం రేవంత్.. ఆదివారం కొంత రిలాక్స్ అయ్యారని చెప్పొచ్చు. లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు.. ప్రత్యర్థి పార్టీల కంటే ముందంజలో ఉండేందుకు సిద్ధం చేసిన ప్రణాళికల అమలులో బిజీగా గడిపిన రేవంత్ ఫుట్‌బాల్‌లోనూ సత్తాచాటారు. దీన్నిబట్టి ఫిట్‌నెస్‌పై, ఫుట్ బాల్ లాంటి గేమ్స్‌పై సీఎం రేవంత్‌కు ఎంత ఆసక్తి ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.