Residential Hostels Issue : తెలంగాణలోని వసతి గృహాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే వేటు వేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. వారికి చట్ట ప్రకారం శిక్షపడేలా చూడాలన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను అక్కడ పనిచేసే సిబ్బంది కన్నబిడ్డల్లా చూడాలని సీఎం సూచించారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తరుచూ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలను తనిఖీ చేసి, పిల్లల బాగోగులను పర్యవేక్షించాలన్నారు. వాటికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపాలని కోరారు.
Also Read :Marriage Trends : పెళ్లి కుదిరాక నో చెప్పారని.. యువతులను వేధిస్తున్న యువకులు
వసతిగృహాలు(Residential Hostels Issue), గురుకులాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించడంలో అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు. తాను గతంలోనూ ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు జరుగుతుండటంపై రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తామన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించేందుకే తాము డైట్ ఛార్జీలను పెంచామని సీఎం గుర్తుచేశారు.
Also Read :December Horoscope : డిసెంబరులో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
విద్యార్థుల విషయంలో తమ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రేవంత్ తెలిపారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పుకార్లతో ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని యత్నిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
Also Read :Sunita Williams : అంతరిక్షంలో సునీతా విలియమ్స్ థాంక్స్‌గివింగ్ వేడుకలు
మాగనూరు జడ్పీ హైస్కూల్ ఘటనతో..
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హైస్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయితే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడింది.