CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
శుక్రవారం సచివాలయంలో పోలీసు, ఆరోగ్య శాఖల్లో నియామకాలపై అధికారులతో సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరగాలని , తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు, ఉద్యోగాల నియామకాలపై నోటిఫికేషన్‌లకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న హోంగార్డుల నియామకాలను వెంటనే చేపట్టాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను సీఎం ఆదేశించారు. పోలీసు శాఖలో ఏడేళ్లుగా హోంగార్డుల నియామకం జరగలేదని, సమర్ధవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకం చేపట్టాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్య, ఆర్థిక, వైద్య అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు హోంగార్డుల సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు.
Also Read: King Nag: నాగార్జున క్రేజీ అప్డేట్, నా సామి రంగ టీజర్ రెడీ