Sania Mirza – MP Candidate : కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా ?

  • Written By:
  • Updated On - March 27, 2024 / 03:13 PM IST

Sania Mirza – MP Candidate : ఈసారి ఎన్నికల్లో కనీసం 14 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు.  ఈక్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంపీ స్థానాలను పెద్దసంఖ్యలో గెలుచు కునేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో ప్రజాదరణ, ప్రజల్లో స్టార్ ఇమేజ్ కలిగిన వారిని బరిలోకి దింపాలని రేవంత్ భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె పేరే సానియా మీర్జా(Sania Mirza – MP Candidate). ఈసారి హైదరాబాద్ లోక్‌సభ టికెట్‌ను సానియా మీర్జాకు కేటాయించాలని రేవంత్ భావిస్తున్నారట. ఈవిషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం వద్ద కూడా ఆయన ప్రస్తావించారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధిష్టానం ఒక నిర్ణయం వెలువరించే ఛాన్స్ ఉందని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం ఒవైసీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. సానియా మీర్జాను బరిలోకి దింపితే అక్కడ పెద్దసంఖ్యలో ముస్లిం  మైనారిటీ వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయని రేవంత్ అంచనా వేస్తున్నారు. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీని ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంలో భాగంగానే సానియా మీర్జాకు హైదరాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీ అవుతోందట. ఎన్నికల్లో పోటీ  చేసేందుకు సానియా మీర్జా సిద్ధంగా ఉన్నారా ? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.  అయితే సీఎం రేవంత్ టీమ్ ఇప్పటికే ఈ అంశంపై సానియా మీర్జా, ఆమె కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ సానియా మీర్జా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయితే.. ఆమెను తెలంగాణ సహా సౌత్ ఇండియాలోని స్టేట్‌లలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం వాడుకోనున్నారు. ఇక హైదరాబాద్ లోక్‌సభ స్థానం కోసం సుప్రీంకోర్టు న్యాయవాది షబానా తబస్సుమ్ కూడా పోటీ పడుతున్నారు. దీంతో పాటు మస్కతీ సైతం ఈ రేసులో ఉన్నారని అంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఎంబీటీ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోందని అంటున్నారు. ఆ పార్టీకి ఒక టికెట్ ఇవ్వాలా ? వేరే ఏదైనా నామినేటెడ్ పదవిని ఇచ్చి.. దాని సహకారాన్ని పొందాలా ? అనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోందట.

Also Read :Harish Rao Office Staff : హరీష్‌‌రావు ఆఫీస్‌ స్టాఫ్ అరెస్ట్.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్‌మాల్!