Inauguration Of Rajiv Gandhi Statue – CM Revanth Reddy MOST POWERFULL Speech On కెసిఆర్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (BR Ambedkar Secretariat) ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని (Rajiv Gandhi Statue) సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్‌మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. అలానే పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి
ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజీవి విగ్రహాన్ని పెట్టడాన్ని విమర్శిస్తున్న బిఆర్ఎస్ పై మండిపడ్డారు. రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడని..ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ‘తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు కృతజ్ఞతగా మీరే రాజీవ్ విగ్రహం పెట్టాల్సింది పోయి కూల్చేస్తామంటారా? ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని సన్నాసి నువ్వు. సచివాలయం సాక్షిగా చెబుతున్న బిడ్డా.. మీ ఫామ్హహౌస్లో జిల్లేళ్లు మొలిపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
దొరల గడీలు బద్దలై ప్రజా పాలన
ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి ఇంకా కేసీఆర్ తేరుకోలేదని , రెగ్యులర్ గా ఫామ్ హౌస్లో కెసిఆర్ కు షాక్ ట్రీట్మెంట్ జరుగుతుందని అన్నారు. దొరల గడీలు బద్దలై ప్రజా పాలన వచ్చిందనే విషయం ఆయనకు అర్థం కావట్లేదని , తెలంగాణను కబళించే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.
నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి
అలాగే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ‘ఇప్పుడు ట్విటర్ పిట్ట ట్విటర్లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూటర్ను పుట్టించి, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. లేకపోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వేస్టేషన్లో చాయ్, సమోసా అమ్ముకునేవాడివి’ అని సెటైర్లు వేశారు. ‘కొందరు సన్నాసులు పదేపదే వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఎలాంటి పదవి చేపట్టలేదని వీళ్లకు తెలియదా? తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని మంత్రి పదవులు పొందినవాళ్లు గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తారా?’ అని రేవంత్ ప్రశ్నించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే..కేసీఆర్ చివరి చూపు చూడలేదు
కేసీఆర్ పార్టీ కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించిన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే కూడా కనీసం వెళ్లి చివరి చూపు చూడలేదని ఫైర్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారని, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా తామేమైనా అడ్డుకున్నామా? పదేళ్లు వీళ్లేం చేశారు? అని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోవాలనే ఖాళీ ప్లేస్ పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
Read Also : KTR : సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం..కేటీఆర్