CM Revanth Reddy: ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ భేటీ

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు.

CM Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారిలతో కలిసి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సీఎం కలిశారు. ఈ సమావేశంలో సీఎం మరియు మంత్రి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లు ఆయనకు వినతిపత్రం అందించారు. ఆందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై ముగ్గురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ ఏఐసీసీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. రాబోయే లోక్‌సభ ఎన్నికల వ్యూహం, సీట్ల కేటాయింపుపై హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి రేపు శుక్రవారం విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Also Read; Health Tips: ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర పని చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?