Site icon HashtagU Telugu

CM Revanth Reddy : జల్‌శక్తి మంత్రితో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం

CM Revanth Reddy meeting with Jal Shakti Minister

CM Revanth Reddy meeting with Jal Shakti Minister

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన( Delhi Tour) కొనసాగుతుంది. ఈ క్రమంలో జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌(Jal Shakti Minister C. R. Paatil)తో సిఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని ఈ మేరకు కేంద్ర మంత్రికి రేవంత్‌ విజ్జప్తి చేశారు. హైదరాబాద్‌ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు.. గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్‌, హిమాయత్ సాగర్‌లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉస్మాన్ సాగర్‌, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు ఉండవని సీఎం రెవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. 2019లో జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రారంభమైనా ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధుల ఇవ్వలేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్‌ లేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు పీఎంఏవై (అర్బన్‌), (రూరల్‌) కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్యయమవుతుందని తెలిపారు. ఈ ఏడాది నుంచి జల్‌జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Read Also: Prabhas Raja Saab : రాజా సాబ్ ఇక సంక్రాంతికే ఫిక్స్ అవ్వొచ్చా..?