Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు.

Lok Sabha Polls 2024: రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ బాధ్యతలను సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తీసుకున్నారు.

We’re now on WhatsAppClick to Join

షెడ్యూల్ భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలైంది, మధ్యాహ్నం ఒంటి గంటలకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటలకు మల్కాజి​గిరి లోక్‌సభ నియోజకవర్గంలో సీఎం ప్రసంగిస్తారు. ఇక రేపు నాగర్ కర్నూల్ ప్రచారం చేయనున్నారు. అంతేకాదు ఈ నెల 24 వరంగల్, 25న చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.

లోకసభ ఎన్నికల్లో 15 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆ దిశగానే వ్యూహంతో ముందుకెళ్తుంది. కాగా లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్​రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దలు రాహుల్ గాంధీ , ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు కూడా పాల్గొంటారు.

Also Read: Amit Shah : అమిత్‌ షా తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు