Site icon HashtagU Telugu

Mahabubnagar : పదవులకు డీకే అరుణ ముందు…అభివృద్ధికి వెనుక – సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Mbng

Cm Revanth Mbng

వ్యాపారాలు, పదవుల కోసం మాత్రమే డీకే అరుణ (DK Aruna) ముందు ఉంటారని అభివృద్ధికి మాత్రం వెనుకుంటారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌లోని కొత్తకోట వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీకే అరుణ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉండొద్దని ఢిల్లీ నుంచి వచ్చినవారు చూస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. డీకే అరుణకు కాంగ్రెస్‌ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసిందన్నారు. 70 ఏళ్ల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడని, గత ఎన్నికల్లో పాలమూరులో 14 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయాలు పక్కన పెట్టి పాలమూరు అభివృద్ధి కోసం కలసి రావాలని డీకే అరుణను కోరానన్నారు. డీకే అరుణకు కాంగ్రెస్ ఏమీ చేయలేదా అన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం కోట్లాడుతుంటే బీజేపీ నేతలు తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలకు డీకే అరుణ వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని తాను చెప్పానని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎడారి చేయాలని చాలామంది చూస్తున్నారని ధ్వజమెత్తారు. డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రైతు రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటానని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు లక్ష మెజారిటీ ఖాయమని , వంశీచంద్‌ రెడ్డిని గెలిపిస్తే పాలమూరు జిల్లాకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతకు ముందు కొత్తగూడెం లో ఏర్పాటు చేసిన జనజాతర సభలో కేసీఆర్ ఫై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ నెల ఎనిమిదో తేదీ లోపు రైతు భరోసా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదో తేది కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని.. బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరా ఫించన్లు కూడా ఈ నెల 9వ తేదీలోగా అందరి ఖాతాల్లో జమ చేస్తామని ఈ సందర్బంగా తెలిపారు.

Read Also : WHO Chief : రఫాలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ రక్తపాతానికి దారి తీస్తుంది: WHO చీఫ్