CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థులు, ఇంఛార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో జూమ్ మీడింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంపీ అభ్యర్థుల(MP candidates)కు కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ సమయం(Counting time)లో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని అలర్ట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలి. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోండని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతీ రౌండ్ లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ప్రతీ ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతీ అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీపీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
Read Also: Thief Sleep : కన్నం వేసిన ఇంట్లోనే కమ్మటి నిద్ర.. కట్ చేస్తే..