Dharani Portal: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ధరణి పోర్టల్ రద్దు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఆనాటి నుండి ధరణి పోర్టల్ పై అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది.

Published By: HashtagU Telugu Desk
Dharani Portal

Dharani Portal

Dharani Portal: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ధరణి పోర్టల్ రద్దు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఆనాటి నుండి ధరణి పోర్టల్ పై అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ రోజు మొట్టమొదటి సారి ధరణి పోర్టల్‎పై సమీక్ష నిర్వహించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై పూర్తిగా సమీక్షించిన రేవంత్ రెడ్డి ధరణి లోపాలపై వారం, పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. సమావేశంలో అధికారులతో రేవంత్ మాట్లాడుతూ.. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను నివేదికలో పొందుపరచాలని చెప్పారు. సీఎం ధరణి యాప్ భద్రతపై ఆరా తీశారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సమాచారం మేరకు ధరణి ప్లేస్ లో ‘భూమాత’పేరుతో కొత్త పోర్టల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణలో కొన్ని వేల ఎకరాలు లెక్కలేకుండా పోయాయని, ఆ భూములన్నీ ఎలా మాయమైపోయాయనే అంశంపై సీఎం రేవంత్ లోతుగా చర్చ జరపినట్లు తెలుస్తోంది. గతంలో 4, 5 ఎకరాలున్న రైతులకు ధరణిలో కొన్ని గుంటల భూమి తక్కువ చూపించిందంటూ ఇప్పటికే వేల సంఖ్యలో కంప్లైట్ వచ్చాయని, ఈ అవకతవకలెందుకు జరిగాయని రేవంత్ అధికారులను ప్రశ్నించనున్నారట.

Also Read: Zulu Scooter: మార్కెట్లోకి విడుదలైన మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

  Last Updated: 13 Dec 2023, 06:35 PM IST