సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఆదివారం కల్వకుర్తి (Kalwakurthy ) లో పర్యటించారు. ఈ సందర్బంగా కల్వకుర్తికి వరాల జల్లు కురిపించారు. కల్వకుర్తిలో 100 పడకల హాస్పటల్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నాం. మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుపరిచేందుకు రూ.10 కోట్లు. నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు. కల్వకుర్తి- హైదరాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్లు అభివృద్ధి చేస్తాం. నేను చదువుకున్న కాండ్ర పాఠశాల రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తాం. ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1 న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. 50 ఎకరాల్లో రూ.100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
త్వరలో పంచాయితీ ఎన్నికలు రాబోతున్నాయి..కార్యకర్తలు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. సాధారణంగా నాయకుల గెలుపు కోసం పని చేసే కార్యకర్తలను ఆ తర్వాత నాయకులు మరిచిపోతూ ఉంటారు. కానీ, మేం అలాకాదు, పంచాయతీ ఎన్నికల్లో మా కార్యకర్తలను తప్పకుండా గెలిపించుకుంటాం. వారిని గెలిపించే బాధ్యతను మేం తీసుకుంటాం అని భరోసా ఇచ్చారు. ఇదే సందర్బంగా జైపాల్ రెడ్డి ఫై ప్రశంసలు కురిపించారు. జైపాల్ రెడ్డి ఎన్నో పదవులు చేపట్టారని, వాటిని సమర్థవంతంగా నిర్వహించి పదవులకే వన్నె తెచ్చారని , ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకు చివరి దాకా నిలబడ్డాడని తెలిపారు. నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది. జైపాల్ రెడ్డి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాలేదు. కల్వకుర్తి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారు అని రేవంత్ పేర్కొన్నారు.
Read Also : Rape : అనకాపల్లిలో మరో దారుణం..స్నేహితురాలి ఫై అత్యాచారం