CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప జ్వరం బారినపడ్డారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గత మూడు రోజులుగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో రేవంత్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ రేవంత్‌ను పరీక్షించి, మందులు సూచించినట్లు సమాచారం. ఇంటి వద్దే రేవంత్‌కు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచే రేవంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలోనూ రేవంత్ కొంత నీరసంగా కనిపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొవిడ్ న్యూ వేరియంట్ జేఎన్1 చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రత్యేకించి కొత్త కొవిడ్ కేసుల్లో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే బయటపడుతున్నాయి. కరోనా వ్యాప్తిపై ఇటీవల వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్.. అకస్మాత్తుగా జ్వరం బారిన పడ్డారు. ఇక ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌ను క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ పీస్ సదస్సుకు హాజరు కావాలని సీఎంను ఆయన కోరారు. ఇందుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎలాంటి రాజకీయాల ప్రస్తావన రాలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో నివసించే క్రైస్తవ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న కొన్ని అంశాలను రేవంత్ రెడ్డి(CM Revanth) దృష్టికి కేఏ పాల్ తీసుకెళ్లినట్లు సమాచారం.
Also Read: January 1 : 2024లో ఫస్ట్ డే.. తెలంగాణలో సెలవు.. ఏపీలో రూ.3వేల పెన్షన్
తెలంగాణ కొత్త సీఎం రేవంత్ నిర్ణయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నిర్ణయాల వల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలపడి ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ నిర్ణయాలు మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉంటున్నాయని చెప్పారు. రేవంత్ చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో అజారుద్దీన్‌కు మైనారిటీ కోటా కింద మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మంత్రి పదవిని ఇచ్చే ముందు అజారుద్దీన్‌కు శాసన మండలి ఎమ్మెల్సీ పదవిని ఇస్తారని తెలుస్తోంది.