Site icon HashtagU Telugu

Young India Police School : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభించిన సీఎం.. ఎక్కడంటే?

CM Revanth Reddy inaugurated Young India Police Schools.. Where is it?

CM Revanth Reddy inaugurated Young India Police Schools.. Where is it?

Young India Police School : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను మంచిరేవులలో ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో పోలీస్ సిబ్బంది కుటుంబాలకు 50% సీట్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి. మిగతా సీట్లను సివిలియన్స్ పిల్లలకు కేటాయించనున్నారు. ఇందులో CBSE సిలబస్, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ స్కూల్ లో ఫీజులు రీజనబుల్ గా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య, సీబీఎస్సీ సిలబస్ ఉంటాయి. క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. అమరులైన పోలీసుల పిల్లలకు ఇందులో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత సర్వీసులో ఉన్న కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎ్‌సల కుటుంబాల పిల్లలకు 50 శాతం సీట్లు కేటాయించారు.

Read Also: Jio Recharge Plan: జియో యూజ‌ర్ల‌కు శుభవార్త‌.. త‌క్కువ ధ‌ర‌కే రీఛార్జ్‌!

ఓపెన్‌ కేటగిరీ విధానంలో సీట్లు అందుబాటులో ఉంటాయి. 1 నుంచి 5 తరగతుల్లో అడ్మిషన్ల కోసం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (వైఐపీఎస్‌) వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. ప్రతి క్లాసులో 40 సీట్లు ఉంటాయి. 5 తరగతుల్లో కలిపి మొత్తం 200 సీట్లు ఉంటాయి. అందులో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు ఉంటాయి. మిగతావి ఇతర పిల్లలకు కేటాయించారు. సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్ లో విద్యాబోధన ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ స్కూల్ లో ఫీజులు రీజనబుల్ గా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య, సీబీఎస్సీ సిలబస్ ఉంటాయి. క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. కాగా, విధి నిర్వహణలో ఉండి పోలీసు అధికారులు కుటుంబాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని, అలాంటపుడు వారి పిల్లల చదువు సవాలుగా మారుతుందని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ స్కూలు తెలంగాణ పోలీసు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ పోలీసులు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు

. పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ yipschool.in ఓపెన్‌ చేయాలి
. వెబ్‌సైట్‌లో ‘అడ్మిషన్స్’ విభాగానికి వెళ్లి క్లిక్ చేయండి
. విద్యార్థి మొదటి పేరు
. విద్యార్థి చివరి పేరు
. తల్లిదండ్రుల మొదటి పేరు
. తల్లిదండ్రుల చివరి పేరు
. 1 నుంచి 5వ తరగతిలో ఏ క్లాస్‌లో చేరతారో టైప్‌ చేయండి
. పోలీస్ కుటుంబాలు లేదా నాన్ పోలీస్ కుటుంబాల్లో మీ ఆప్షన్ ఎంచుకోండి
. చిరునామా ఇవ్వండి
. ఈమెయిల్ ఐడీ ఇవ్వండి
. ఫోన్ నంబర్ టైప్ చేయండి
. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి

Read Also: CM Chandrababu : రేపు ఒంటిమిట్ట రాముని కళ్యాణోత్సవం..పట్టు వస్త్రాలు, సమర్పించనున్న సీఎం చంద్రబాబు