CM Revanth Reddy: రైతు రుణమాఫీ కార్యక్రమాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు కెసి వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
వరంగల్ లో జరిగే బహిరంగ సభ కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా అహ్వాయించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వరంగల్‌లో రైతు రుణమాఫీని ప్రకటించినందున, దాని అమలును హైలైట్ చేయడానికి పార్టీ అక్కడ బహిరంగ సభ నిర్వహించడం సముచితమని ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజేయాలనుకుంటున్నారని వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వరంగల్ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ వర్గాలు.
6,098 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం మొదటి దశ రుణమాఫీ పథకాన్ని జూలై 18న ప్రారంభించింది.ఈ దశ రూ.1 లక్ష వరకు రుణాలను కవర్ చేస్తుంది. ఈ పథకం మూడు దశల్లో కొనసాగుతుంది. రెండవ దశ జూలై చివరి నాటికి రూ. 1.5 లక్షల వరకు రుణాలు మరియు చివరి దశ ఆగస్టులో రూ. 2 లక్షల వరకు రుణాలను అందజేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Oral Cancer: షాకింగ్.. మద్యం తాగితే నోటి క్యాన్సర్ వస్తుందా..?
