CM Revanth Reddy Governance : ప్రజా క్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన..

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 09:12 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) కాంగ్రెస్ పార్టీ (Congress) ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (సీఎం Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసి తన మార్క్ కనపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరిచాడు. గత ప్రభుత్వానికి భిన్నంగా..ప్రజా సమస్యలు వింటూ వాటిని పరిష్కరిస్తూ ప్రజా క్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నాడు. మాట ఇచ్చామంటే “మాట తప్పం మడమ తిప్పం” అనే విధంగా తన విధానాలు కొనసాగిస్తున్నాడు.

సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆరు గ్యారెంటీల ఫైల్ ఫై తొలి సంతకం (CM Revanth Reddy Signs Files of Six Guarantees) చేసారు. అలాగే అదే వేదికపై నిరుద్యోగి దివ్యాంగురాలైన రజిని (Rajani)కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రం అందజేశారు. పదేళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేని ప్రగతి భవన్ (Pragathi Bhavan ) ను ప్రజా భవన్ (Praja Bhavan) గా మర్చి ప్రజలకు లోనికి వచ్చే అవకాశాన్ని కల్పించారు. ప్రజావాణి పేరిట నేరుగా ప్రజల సమస్యలు వినేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజు రేవంతే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు విని..వారికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మంగళవారం , శుక్రవారం రెండు రోజులు ప్రజావాణి లో ప్రజల సమస్యలు తెలుసుకునేలా ప్రణాళిక చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు , అధికారులు స్వయంగా పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించాలని ఆదేశించారు.

అలాగే అధికారం చేపట్టిన రోజే ఉద్యమకాలం నాటి కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలిపి ఉద్యమకారుల్లో ఆనందం నింపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరెవరి ఫై కేసులు నమోదు అయ్యాయో తెలుసుకొని వాటిని ఎత్తివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు. అంతే కాకుండా మొదటిరోజే కాబినెట్ భేటీ అయ్యి విద్యుత్తు శాఖ ఫై సీరియస్ అయ్యారు. విద్యుత్తు శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటు పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు రేవంత్. తన కార్యాలయంలో కీలక వ్యక్తులను నియమించుకుంటున్నారు. గత ప్రభుత్వ సలహాదారులను తొలగించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక సోనియా పుట్టిన రోజు నాడే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల్లో రెండు హామీలకు శ్రీకారం చుట్టి ప్రజల్లో నమ్మకం పెంచారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ హాల్లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకాన్ని (Rajiv Aarogyasri Scheme ) ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చినట్లే రూ. 10 లక్షలకు పెంచి ఆనందం నింపారు. అలాగే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణ సౌకర్యానికి శ్రీకారం చుట్టారు. జీరో టికెట్ తో రాష్ట్రం మొత్తం ప్రయాణం చేసేలా ఈ పథకం తీసుకొచ్చి మహిళలలో సంతోషం నింపారు.

అలాగే సమాజాన్ని పెడదోవ పట్టించే డ్రగ్స్ (Drugs) దందాను కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్‌లో విదేశీ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కల్చర్ కూడా చాపకింద నీరులా మారుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలతోపాటు, స్థానికంగా లభించే గంజాయి వంటివాటి వినియోగం కూడా పెరుగుతోంది. ఆన్ లైన్ లో కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు కొంతమంది. అరెస్ట్ లు సహజమే కానీ, దీన్ని పూర్తిగా అరికట్టడం మాత్రం సాధ్యం కావడంలేదు. అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజుల్లోనే రేవంత్‌రెడ్డి దీనిపై ఫోకస్‌ పెట్టారు. ఇకపై తెలంగాణలో మత్తుమందు అనే పేరే వినపడకూడదని తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోను మరింత పటిష్ట పరచాలని సూచించారు.

ఇక టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రక్షాళనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అన్ని పోటీ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేయాలనే అలోచన చేస్తున్నారు. త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా అభయాహస్తం మ్యానిఫెస్టోలో జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇచ్చిన హమీలను నెరవేర్చే పనిలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ఇలా రేవంత్ సీఎం గా ప్రమాణం చేసిన వారం రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ప్రజలకు కావాల్సిన అవసరాలపై దృష్టి పెట్టారు. అంతే కాదు మాజీ సీఎం ప్రమాదానికి గురయ్యారని తెలిసి రాజకీయాలతో సంబంధం లేకుండా స్వయంగా హాస్పటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించి..ఆయన ఆరోగ్యం ఫై ఆరా తీసి అందరివాడయ్యాడు. ఇలా రేవంత్ అన్ని విషయాల్లో తన మార్క్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జై రేవంత్ అంటూ జై జై లు పలుకుతున్నారు.

Read Also : CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో సీఎం జగన్ అలర్ట్