Site icon HashtagU Telugu

Good News To Students : విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ ..

Cm Revanth Students

Cm Revanth Students

సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తనదైన మార్క్ కనపరుస్తూ ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు (Heavy Books Schools ), ధరలు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. పుస్తకాల తయారీలో 90GSM పేపర్‌కు బదులు 70GSM పేపర్‌ను వాడాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

గతంలో వినియోగించిన 70GSM పేపర్‌ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ 90GSMకు పెంచారు. దీనికి తోడు ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్, తెలుగు అంటూ రెండు భాషల్లో ముద్రించడం మూలంగా బరువు, ధరలు కూడా పెరిగాయి. దీంతో పుస్తకాల బరువు, ధరలు తగ్గించాలని ప్రధానోపాధ్యాయుల సంఘం కోరుతోంది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పుస్తకాల సంచి బరువు ఎంతగా పెరిగిపోయిందో తెలియంది కాదు..వారి బరువు కన్నా..పుస్తకాల బరువే ఎక్కువగా ఉంది. ఈ కారణంగా వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేలాదిమంది విద్యార్థులు చిన్నతనంలోనే వెన్నెముకతోపాటు కండరాల సమస్యలను సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. పుస్తకాల బరువు మోయడంవల్ల అలసిపోయి కొంతమంది విద్యార్థులు సక్రమంగా చదువుకోలేని పరిస్థితి నెలకొంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలు నోటు, పాఠ్యపుస్తకాల సంఖ్య పెంచేశాయి. విద్యార్థి తమ శరీర బరువులో మూడో వంతు బరువును ప్రతిరోజూ మోస్తుండడంతో దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర సిలబస్‌తోపాటు పాఠశాలలు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్‌, ఐఐటీ, సీబీఎస్‌ఈ, ఇలా వివిధ రకాల పుస్తకాలను మోయాల్సి రావడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. దీంతో డాక్టర్స్, పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు పుస్తకాలు తగ్గించాలని ప్రధానోపాద్యాలను కోరుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్లడం తో పుస్తకాల బరువు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read Also : Free Bus Scheme : రేవంత్ అన్న..ఏంటి మాకు ఈ తిప్పలు ..బస్సు కండక్టర్ల ఆవేదన