Group 1 Notification : గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్.. 660 పోస్టుల భర్తీ ?

Group 1 Notification : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ సర్కారు మరో  గుడ్ న్యూస్ చెప్పనుంది.

  • Written By:
  • Updated On - February 3, 2024 / 11:30 AM IST

Group 1 Notification : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ సర్కారు మరో  గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపు 660 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. వాస్తవానికి 503 గ్రూప్ –1 పోస్టులను గతంలోనే గుర్తించారు. అదనంగా ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రూప్–1(Group 1 Notification) పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. దీంతో అదనంగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీ అవుతాయని తేల్చారు. అంటే పాతవి 503.. కొత్తవి  160 పోస్టులు కలుపుకుంటే మొత్తం గ్రూప్-1 పోస్టుల సంఖ్య 660 దాటుతుంది. వీటిని భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియను చేపట్టాలా? త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలా ? అనే అంశంపై ఆదివారం రోజు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా? పాత నోటిఫికేషన్ కు కొనసాగింపుగా సప్లమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే అంశంపై మంత్రివర్గం సమావేశం తరువాత క్లారిటీ రానుంది.

We’re now on WhatsApp. Click to Join

ఇక గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకైంది. దీంతో పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. తుది తీర్పు పెండింగ్ లో ఉంది. అయితే ఆ కేసును విచారించి, తీర్పు వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేసును వెనక్కి తీసుకుని కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : Hiring Mason : తాపీమేస్త్రీ కావలెను.. ఏడాదికి రూ.4.50 లక్షల ప్యాకేజీ

ఆర్టీసీ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC).. అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ (TSRTC) రీజియన్ల (డిపో/ యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా TSRTCలో 150 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఖాళీలకు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

Also Read : Jeff Bezos : రూ.75వేల కోట్ల షేర్లు అమ్మేస్తా.. అపర కుబేరుడి ప్రకటన