CM Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 09:05 PM IST

గత కొద్దీ రోజులుగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) గుడ్ న్యూస్ తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం (Rythu Bandhu scheme) చెల్లింపులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని, దీంతో గతంలో మాదిరి రైతు బంధు (Rythu Bandhu scheme) చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని సూచించారు. తెలంగాణ ఎన్నికలకు ముందు రైతు బంధు సాయం అందించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ (Election Code)కారణంగా రైతు బంధు నిధుల విడుదల నిలిచిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ తాజాగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఆరు నెలలకు ఎకరానికి ప్రభుత్వం రూ.5000 అందిస్తున్నారు. ఏడాదిలో రెండు పర్యాయాలు… మొత్తం రూ.10,000 అందిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలోనూ పెట్టారు. అయితే ఇంకా విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఈసారికి గత విధివిధానాల ప్రకారం ఇవ్వనున్నారు.

Read Also : CM Jagan : 11 నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చిన జగన్..