Site icon HashtagU Telugu

Prajabhavan : చంద్రబాబు కు ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

Meeting Of CMs

Meeting Of CMs

హైదరాబాద్ ప్రజాభవన్లో (Praja Bhavan) తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి (Chandrababu & Revanth Reddy) భేటీ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ నివాసం నుండి ప్రజాభవన్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్.. చంద్రబాబుకు కాళోజీ నారాయణరావు రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు.

నిజాం పాలనలో అన్యాయాలను ప్రశ్నిస్తూ కాళోజీ ఈ పుస్తకాన్ని రచించారు. ఇక ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వేంనరేందర్‌రెడ్డి, వేణుగోపాల్, సీఎస్ హాజరుకాగా, ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో ఇరు ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం.. నిధుల కేటాయింపు, నీళ్ల సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వవ్యస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లోని సంస్థల అస్తుల పంపకాలు , షీలా బీడే కమిటీ సిఫార్సులు , తెలంగాణ నుంచి తమకు రావలసిన విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులు తదితర అంశాల ఫై చర్చించనున్నారు. ప్రస్తుతం ప్రజా భవన్ వద్ద భారీగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేసారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నాలు , ఆందోళనలు కొనసాగుతుండడంతో ..ఇంకాస్త భద్రత పెంచారు.

Read Also : Singireddy Niranjan Reddy : రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబించారు