తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడం..నిన్న నల్గొండ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని.. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్..నల్గొండ సభలో అలాంటి భాష వాడొచ్చా అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఓ సీఎంను పట్టుకుని ‘ఏం పీకనీకి పోయారా.?’ అని అంటారా ..? ఇదేనా తెలంగాణ సంప్రదాయం.. ఇది పద్ధతా.? అని మండిపడ్డారు. తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డకు వచ్చేది. పదే పదే బీఆరెస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారు. మాజీ సీఎం నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా? మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా? కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం.. నీళ్లు నింపి చూపించండి. చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి. కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధం.’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యాంట్ ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేడిగడ్డలో కూలింది రెండు పిల్లర్లే అయితే.. వాటి మీదైనా మాట్లాడేందుకు కేసీఆర్ సభకు రావాలి. గురువారం సాయంత్రం వరకైనా కేసీఆర్ సభకు వస్తే చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు.’ అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Congress : కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు