Site icon HashtagU Telugu

KCR : కేసీఆర్‌ను చూస్తే జాలేస్తోంది – సీఎం రేవంత్

Telangana

Telangana

మూడోసారి సీఎం పీఠం ఫై కూర్చువాలని కలలు కన్నా అది కాస్త ‘కల’గానే మిగలడం..కూతురు (Kavitha) తీహార్ జైలు కు వెళ్లడం..వరుసపెట్టి నేతలు పార్టీని వీడడం..ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ (KCR) ను చూస్తుంటే జాలేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ నెల 06 న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బహిరంగసభ ఏర్పటు చేయబోతుంది…ఈ క్రమంలో సభ ఏర్పాట్లను, ప్రాంగణాన్నిసీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కు పదేళ్ల తర్వాత తెలంగాణ రైతులు గుర్తొచ్చినందుకు సంతోషం. అధికారం పోకుండా ఉండి ఉంటే.. కిందపడి గాయం కాకుండా ఉంటే.. కూతురు జైలుకు వెళ్లకపోయి ఉంటే ఆయన ఎవరికీ దొరికే వారు కాదు. కాంగ్రెస్‌ వచ్చింది కరువు వచ్చింది అని కేసీఆర్‌ అంటుండు.. మేం అధికారంలోకి వచ్చిందే చలికాలంలో… వర్షాకాలంలో అధికారంలో ఉన్నది వాళ్లే.. కేసీఆర్‌ పాపాలకు వరుణ దేవుడు కూడా భయపడి అప్పట్లో పారిపోయాడు’ అని రేవంత్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ పాపాలతోనే కరువు పరిస్థితులు వచ్చాయని, ఆయన చేసిన పాపాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ దూకుడు పెంచుతుంది. ఇప్పటికే అభ్యర్ధ్జులు తమ ప్రచారం మొదలుపెట్టారు. 17 కు 17 సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి గట్టిగా వీస్తుండడం తో లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం అని అంత భావిస్తున్నారు. ఇదిలా ఉంటె బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడం తో కాంగ్రెస్ బలం కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.

Read Also : Delhi : ఢిల్లీ తదుపరి సీఎం సునీతా కేజ్రీవాల్?..ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

Exit mobile version