KCR Birthday : అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌

తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు ఈరోజు (KCR Birthday Today). ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతూ..తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో […]

Published By: HashtagU Telugu Desk
Revanth Wishesh To Kcr

Revanth Wishesh To Kcr

తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు ఈరోజు (KCR Birthday Today). ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతూ..తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైతం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, ఉద్యమ నాయకుడు ,కారణజన్ముడు అయిన కేసీఆర్‌ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. తన తండ్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్‌ కట్‌ చేసి ముందుగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు తినిపించారు.

Read Also : Mahbubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం..21 వీధికుక్కల కల్చివేత

  Last Updated: 17 Feb 2024, 01:55 PM IST