Makar Sankranti: తెలంగాణ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇల్లు నూతన శోభతో శోభాయమానంగా వెలుగొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగు రాష్ట్రమంతటా విస్తరిస్తుందని అన్నారు.ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే సంక్రాంతి, భోగి, కనుమ పండుగలను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు .
తెలంగాణలో ప్రారంభించిన ప్రజాపాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఆనందిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
భోగి మంటల సాక్షిగా ఉత్తరాయణ కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ…
రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. #bhogi #Bhogi2024 #BhogiFestival pic.twitter.com/iLnBVXB3SK
— Revanth Reddy (@revanth_anumula) January 14, 2024
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. విద్యుత్ సరఫరా, బొగ్గు కేటాయింపు, పౌరసరఫరాల బకాయిలు, హైదరాబాద్-నాగపూర్ కారిడార్‌కు అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. అలాగే కేసీ వేణుగోపాల్ తో తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు.
Also Read: Ram Temple: రామ మందిర నిర్మాణం పట్ల ముస్లింల అభిప్రాయం ఇదే.. ఎంతమంది సంతోషంగా ఉన్నారో తెలుసా..?