KTR : కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలనీ సీఎం రేవంత్ డిమాండ్

‘కేంద్రం నుంచి తెలంగాణ కు రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నాచౌక్లో కేటీఆర్ (KTR) ఆమరణ నిరాహార దీక్ష (strike) చేస్తే మద్దతిస్తాం. గతంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తిని తీసుకొని.. కేటీఆర్ సచ్చుడో, నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిమాండ్ చేసారు. గురువారం సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ […]

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

‘కేంద్రం నుంచి తెలంగాణ కు రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నాచౌక్లో కేటీఆర్ (KTR) ఆమరణ నిరాహార దీక్ష (strike) చేస్తే మద్దతిస్తాం. గతంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తిని తీసుకొని.. కేటీఆర్ సచ్చుడో, నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిమాండ్ చేసారు.

గురువారం సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. 11 కి.మీ పొడవు, 6 లేన్లతో రానున్న ఈ భారీ ఎలివేటేడ్ కారిడార్​ను రూ.2,232 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. భూమి పూజ అనంతరం మాట్లాడిన సీఎం.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్​ఎస్​ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్‌ వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్​లో అభివృద్ధి జరిగింది ఏమీ లేదన్న ఆయన, గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని, ఎన్నికలయ్యాక రాష్ట్ర అభివృద్దే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. రెండో దశలో 75 కి.మీ మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని వివరించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ దూర దృష్టి నిర్ణయాల వల్లే భాగ్యనగరం అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ‘కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నాచౌక్లో కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మద్దతిస్తాం. గతంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తిని తీసుకొని.. కేటీఆర్ సచ్చుడో, నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి’ అని ఈ సందర్బంగా రేవంత్ బిఆర్ఎస్ ను కోరారు. ఆ ధర్నాకు కాంగ్రెస్‌ పూర్తిగా సహకరిస్తుందని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also : CM Revanth : మల్లారెడ్డి కాళ్లబేరానికి వచ్చినట్లేనా..?

  Last Updated: 07 Mar 2024, 03:47 PM IST