CM Revanth Reddy: గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). అయితే ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యులతో సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరిన సీఎం, డిప్యూటీ సీఎం.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అపాయింట్మెంట్ ను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Short Circuit: షార్ట్ సర్క్యూట్ కారణాలు ఏమిటి? అసలు ఎలా గుర్తించాలి..?
క్రీడా రంగానికి సంబంధించి భారీ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కమ్యూనికేషన్ శాఖామంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ కానున్నట్లు సమాచారం. క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సాయంత్రం 5 గంటలకు భేటీ అవుతారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతోనూ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రైతు రుణమాఫీపై నిర్వహించే సభకు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్యులను ఆహ్వానించనున్నారు. ఆయా రాష్ట్రాలకు నూతన పీసీసీ అధ్యక్షులు నియామకం ఎఐసిసి కమిటీ, రాష్ట్రాలకు ఇన్చార్జిల నియామకం, మార్పులు చేర్పులపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. తెలంగాణకు నూతన పీసీసీ అధ్యక్షుడు నియామకం, కార్యవర్గం ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ క్యాబినెట్ విస్తరణపై అధిష్టాన ముఖ్యులతో చర్చించే అవకాశం ఉంది.