CM Revanth Reddy: రేపు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అవుతారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ అధీష్టానంతో సమావేశం నిర్వహించన్నారు. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నారు.అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
Also Read: Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన మంత్రి.. లీగల్ నోటీసులు జారీ