Site icon HashtagU Telugu

Hyderabad: కేసీఆర్ హయాంలో నగరంలో డ్రగ్స్‌, పబ్‌ కల్చర్ :సీఎం రేవంత్‌

Hyderabad

Hyderabad

Hyderabad: గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి , డ్రగ్స్, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ నగరంగా తీసుకొచ్చిన ప్రతిష్టను నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే తరుణం వచ్చిందన్నారు సీఎం రేవంత్.

అల్వాల్‌ సమీపంలోని హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌హదారి రోడ్డులో పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, గంజాయి, పబ్‌ల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నగరంలో డ్రగ్స్ పుట్టుకొచ్చాయి.కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ జరిగింది, ప్రజల ప్రయోజనాలకు నోచుకోలేదు మరియు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఏదైనా అభివృద్ధి మరియు సంక్షేమం కోసం కేంద్రం సహాయం అవసమన్నారు సీఎం.

ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రానికి సహకరిస్తామని చెప్పారు.రెండో దశలో 75 కి.మీ మేర మెట్రో విస్తరణ చేపట్టబోతున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగానే రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ల ప్రాజెక్టు ఆగిపోయిందని రేవంత్‌రెడ్డి అన్నారు.

Also Read: TDP-JSP : సోషల్‌ మీడియా క్యాడర్‌ను టీడీపీ-జేఎస్పీ కాపాడుకుంటోంది.!