Site icon HashtagU Telugu

CM Revanth Reddy : కేటీఆర్‌.. చర్లపర్లి చిప్ప కూడు తింటావు..

Indiramma Committees

Cm Revanth Reddy

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పాత్ర పోషించిన నాలుగో నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘ విచారణ తర్వాత, కమిషనర్ టాస్క్ ఫోర్స్‌లోని మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి రాధాకృష్ణా రావు (Radhakrishna Rao)ను అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. రాధాకృష్ణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆ తర్వాత నగరంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా ఉన్నారు. అరెస్టు చేసిన ఇద్దరు మాజీ పోలీసులు భుజంగరావు, తిరుపతన్నలను విచారణ నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నాంపల్లి కోర్టు ఇద్దరు పోలీసులను ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. ఈ నేపథ్యంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంపై మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పై మొదటి సారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ కి సిగ్గు ఉండాలే.. ఫోన్ లు విన్నాం వింటే ఏమైతది అంటున్నాడు.. ఏమైతది చర్లపల్లి చిప్ప కూడు తింటావు అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తాగు బోతు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు.

అచ్చోసిన ఆంబోతులెక్క మాట్లాడుతున్నాడని, దాని ఫలితం ఆయన అనుభవిస్తాడని సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల మనం గెలిచే సీటు అని.. దొరసాని వచ్చి.. అల్లుడికి ఓటు వేయించారన్నారు. మనల్ని కాదని వేరే వాళ్లకు ఓటు వేస్తే ఏం లాభమన్నారు రేవంత్‌ రెడ్డి. డీకే అరుణ (DK Aruna) జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుందని, మరి పాలమూరు కి పది పైసలు పని చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదని, పదేళ్లు మోడీనే ప్రధాని అని.. ఇప్పుడు పాలమూరులో ఓటేస్తే మోడీ (Narendra Modi) చంద్రమండలంకి రాజు ఐతడా అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.
Read Also : Pawan Kalyan : పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..