CM Revanth Reddy: కేసీఆర్ చెల్లని 1000 నోటు: సీఎం రేవంత్

కేసీఆర్‌ను రూ.1000 నోటుతో పోలుస్తూ, ఆయన ఇంకెప్పటికీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని, అలాంటి నోటు ఇంకెవరైనా వద్ద ఉంటే జైలుకెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

CM Revanth Reddy: ఏప్రిల్ 6వ తారీఖున సాయంత్రం 5.00 గంటలకు తుక్కుగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ జనజాతర’ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏప్రిల్ 6న తుక్కుగూడ కార్యక్రమంలో ప్రకటిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఐదు గ్యారంటీలు ఉంటాయన్నారు. గతంలో ఆరు గ్యారంటీలను తెలంగాణ కాంగ్రెస్ తుక్కుగూడ సభలోనే ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

కేసీఆర్ పై రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. రైతుల కష్టాలపై చంద్రశేఖర్‌రావు అధికార పార్టీపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ.. తమ పార్టీ రూ.1500 కోట్ల ఎలక్టోరల్ బాండ్ ఫండ్ నుంచి రైతులకు రూ.100 కోట్లు ప్రకటించాలని రేవంత్ ఆయనకు సూచించారు. ఆత్మహత్య చేసుకున్న 200 మంది రైతుల పేర్లను బీఆర్‌ఎస్‌ తెలియజేస్తే పరిహారం ఇస్తాం. చనిపోయిన రైతుల పేర్లను కేసీఆర్ 48 గంటల్లోగా తెలియజేయాలన్నారు. కేసీఆర్‌ను రూ.1000 నోటుతో పోలుస్తూ, ఆయన ఇంకెప్పటికీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని, అలాంటి నోటు ఇంకెవరైనా వద్ద ఉంటే జైలుకెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

We’re now on WhatsAppClick to Join

కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయి, కూతురు జైలులో ఉండకుంటే రాష్ట్రానికి ఎప్పటికీ అందుబాటులో ఉండేవారు కాదు అని వ్యాఖ్యానించారు సీఎం. ఇంకా ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక నిధులు, అనుమతులు వస్తాయని చెప్పారు. కాగా ‘తెలంగాణ జనజాతర’ సభకు ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే హాజరుకానున్నారు.

Also Read: Pushpa 2 : తగ్గేదెలే.. పుష్ప-2 ది రూల్ టీజర్.. ఎప్పుడంటే..?