KTR : కేటీఆర్ ను చీర కట్టుకోవాలని సీఎం రేవంత్ సలహా

నీకు సినీ పరిశ్రమ వాళ్లు బాగా తెలుసు కదా. నువ్వు చీరకట్టుకుని ఆడపిల్లలా మంచిగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. నిన్ను టికెట్ కి డబ్బులు అడిగితే 6 గ్యారంటీలు అమలు కానట్టే

  • Written By:
  • Publish Date - May 5, 2024 / 04:04 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ (Telangana) లో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్యసవాళ్లు , ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ..’ఈ వేదిక నుంచి కేటీఆర్ (KTR) కు ఒక సూచన చేస్తున్నా.

We’re now on WhatsApp. Click to Join.

అయ్యా.. నీకు సినీ పరిశ్రమ వాళ్లు బాగా తెలుసు కదా. నువ్వు చీరకట్టుకుని ఆడపిల్లలా మంచిగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. నిన్ను టికెట్ కి డబ్బులు అడిగితే 6 గ్యారంటీలు అమలు కానట్టే. టికెట్ అడగకపోతే మేము 6 గ్యారంటీలు అమలు చేసినట్టే’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఆదిలాబాద్ లో మూతబడిన పరిశ్రమలను తెరిపిస్తామని, పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేసారు. గత బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Read Also : Amith Sha : రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం – అమిత్ షా