CM : కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడు..

కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదని, ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవకారులు ఈ జిల్లా నుంచి పోరాటాలు చేశారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 08:20 PM IST

కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనదని, ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవకారులు ఈ జిల్లా నుంచి పోరాటాలు చేశారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ హుజూరాబాద్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..
చింతమడక నుంచి వచ్చిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారని, కరీంనగర్ ను వదిలి కేసీఆర్ మహబూబ్ నగర్ వస్తే మేం ఆలోచించకుండా గెలిపించామన్నారు. సెమీఫైనల్ లో కేసీఆర్ ను చిత్తు చిత్తు చేశామని, ఫైనల్స్ లో తెలంగాణ పౌరుషం గుజరాత్ కు తెలిసే విధంగా మోడీని ఓడించాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పదేళ్లు ప్రధాని గా ఉన్న మోదీ తెలంగాణ కు ఇచ్చింది ఏమీ లేదు.. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది ఏమీ లేదని, పునర్వీభజన చట్టంలోని ఏ అంశాలను కూడా అమలు చేయలేదన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. తల్లిని చంపి బిడ్డను బతికించారంటు పార్లమెంటులో తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను అవమానించేలా మోదీ మాట్లాడారని, తెలంగాణను అవమానించిన బీజేపీకి, బండి సంజయ్ కు ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ లో అరగుండు, నిజమామాబాద్ లో గుండు రాష్ట్రానికి తెచ్చిందేం లేదని, తెలంగాణ కు పదేళ్లు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటక కు చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమని ఆయన అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా..’అయోధ్య లో రాముడి కళ్యాణానికి 15 రోజుల ముందే అక్షింతలు పంచారు.. ఇది శ్రీరాముడిని అవమానించడమే.. హిందువులందరూ ఆలోచించాలి.. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్నారు.. నేను హిందువును..కాని ఓట్ల కోసం హిందుత్వాన్ని వాడుకోం..
దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి.. రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుకునే దిక్కుమాలిన పరిస్థితి కరీంనగర్, నిజామాబాద్ లో ఉంది.. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తోంది.. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించాలన్నదే బీజేపీ కుట్ర.. బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి.. కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంటే మోదీ సమాధానం చెప్పాలి.. తెలంగాణకు వస్తున్న మోదీ రిజర్వేషన్లపైన సమాధానం చెప్పాలి.. బీజేపీని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయి.. దళితులు, బడుగు బలహీనవర్గాలపైన మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తడు.. నేను రిజర్వేషన్లపైన మాట్లాడితే ఢిల్లీ నుంచి వెంటనే పోలీసులు వచ్చారు.. పదేళ్లు కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు..చివరకు ఏమైంది నడుం ఇరిగి మూలకు పడ్డాడు.. కారు కరాబు అయి కార్ఖానాకు పోయింది.. మూలకుపడింది. కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడు.. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సు యాత్ర ఉంది..

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది… మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్,మల్కాజ్ గిరి లాంటి సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు.. నల్గొండ, మెదక్ లాంటి సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నది బీజేపీ ప్రయత్నం.. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వం.. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చి అవతలపారేస్తం.. 12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? బీజేపీ,బీఆర్ఎస్ కుట్రలు చూసే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతునిచ్చాయి.. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది.. తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా మాట ఇస్తున్న ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తా.. వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్ ఎంపీగా లక్ష మెజార్టీతో గెలిపించాలి..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు.
Read Also : BRS : కేసీఆరే కాదు, కేటీఆర్ కూడా భ్రమపడుతున్నారా?