Site icon HashtagU Telugu

Revanth Reddy : అవుటర్ రింగ్‌ రోడ్డు మీ తాత తెచ్చాడా? అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు మీ ముత్తాత కట్టాడా? : సీఎం

Transgenders for traffic control: CM orders to officials

Transgenders for traffic control: CM orders to officials

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే తమ ప్రభుత్వానికి అండగా నిలవాని ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని సీఎం అన్నారు. తన వద్ద నేతలకు ఇవ్వాడానికి ఏమి లేదని, అయినా గానీ తాము చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన వివరించారు. ఎగ్గె మల్లేశం వంటి వాళ్లు రిజర్వ్ బ్యాంక్ కే పైసలు ఇవ్వగలవాళ్లు. వాళ్లకు ఇవ్వడానికి నా వద్ద ఏముంది… నా అంగీ అమ్మినా, లాగు అమ్మినా ఏం రాదు… నేను ఏమిస్తాను వాళ్లకు? మా ఆలోచన విధానం నచ్చి వాళ్లు పార్టీలోకి వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు తమ ప్రభుత్వాని పడగొడతామన్నారు. ఇప్పుడు వాళ్లే కనిపించకుండా పోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ పని అయిపోయిదన్న వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..వాళ్ల పార్టీలో ఎవరున్నారో, ఎవరు లేరో లెక్కపెట్టుకునే పనిలో ఉన్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదన్నారు. ఓడిన వాళ్లను, ఇంట్లో పడుకున్న వాళ్లను, ఫాంహౌస్ లో ఉంటున్న వాళ్లను అడుగుతున్నా… ఈ అవుటర్ రింగ్ రోడ్డు మీ తాత తెచ్చాడా? ఈ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు మీ ముత్తాత కట్టాడా? ఈరోజు హైదరాబాదులో ఉన్న ఐటీ పరిశ్రమలను, ఫార్మా పరిశ్రమలను మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అవి తెచ్చినందువల్లే హైదరాబాద్ ఇవాళ మహానగరంగా మారింది. హైదరాబాద్ నగరానికి మీరేం తెచ్చారని ఇప్పుడు అడుగుతున్నా. మీరేం తెచ్చారంటే… గంజాయి తెచ్చి ఉంటారు, డ్రగ్స్ తెచ్చి ఉంటారు. అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Read Also: J-K: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం