DSC పరీక్షల వాయిదా డిమాండ్లో న్యాయం ఉంటే కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) లు దీక్షలో కూర్చోవాలని సీఎం రేవంత్ సవాల్ (CM Revanth Challenge) విసిరారు. ‘ఎప్పుడు పేద విద్యార్థులే ఎందుకు నిరాహార దీక్షలు చేయాలి. ఈసారి దీక్ష చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావులను నిరుద్యోగులు ఆహ్వానించాలి. వారిద్దరూ దీక్షకు కూర్చుంటే రక్షణ కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయంగా బలహీనం అయినప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారని మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్న ఆయన జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో ధ్వజమెత్తారు.
గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ వేయాలని, ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని , టెట్‌కు, డీఎస్సీకి పొంతన లేని సిలబస్ ఉండడంతో ప్రిపరేషన్‌కు సమయం సరిపోవడం లేదని వారంతా ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నేడు మహబూబ్ నగర్ పర్యటన లో నిరుద్యోగుల డిమాండ్స్ ఫై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘పరీక్షలు తరచూ వాయిదా వేస్తే యువత నష్టపోతుంది. త్వరగా పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రానివారు మరో ఉద్యోగం చూసుకుంటారు. గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే.. కోర్టు నోటిఫికేషనన్ ను రద్దు చేస్తుంది. పదేపదే పరీక్షలను రద్దు చేయించాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది’ అని సీఎం ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా ఉందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరీక్షలు వాయిదా వేయాలని తనను అడిగారని వెల్లడించారు. ‘వ్యాపారం కోసమే వాళ్లు వాయిదా వేయాలని కోరుతున్నారు. బిఆర్ఎస్ వాళ్లు తమ రాజకీయ మనుగడ కోసం పేద, బడుగు బలహీన వర్గాల వారిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారు’ సీఎం వ్యాఖ్యానించారు.
ఇక కేటీఆర్ , హరీష్ రావులకు సవాల్ విసురుతున్నా… పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయండి. పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టడం కాదు.. మీ వాదన నిజమైతే వాళ్ల పక్షాన మీరు దీక్షకు దిగండి. మా ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే.. ఆమరణ నిరాహార దీక్షకు దిగండి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అన్నారు.
Read Also : Head Coach Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్