CM Revanth Reddy Holi Celebrations : మనవడితో కలిసి హోలీ ఆడుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Holi

Cm Revanth Holi

దేశ వ్యాప్తంగా హోలీ (Holi Celebrations) సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతి ఒక్కరు కులమత బేధం లేకుండా హోలీ వేడుకలను జరుపుకున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు సైతం తమ ఫ్యామిలీ సభ్యులతో హోలీ ని జరుపుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సీఎం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ” పరిపాలన, రాజకీయం, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, తీరిక లేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోలీ నాడు.. మనవడితో ఆటవిడుపు” అంటూ రాసుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పిక్స్ చూసి అభిమానులు , పార్టీ శ్రేణులు తెగ షేర్ చేస్తూ..ఓ పక్క సీఎం గా ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ..ఇలా కుటుంబ సభ్యులతో కలిసి హోలీ ని జరుపుకున్నారని ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని విజయకేతనం ఎగురవేసిన రేవంత్..ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేయాలనీ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేసారు.

అంతకు ముందు రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్త వర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Ragi Dosa: ఎంతో టేస్టిగా ఉండే రాగి దోశలు.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు?

  Last Updated: 25 Mar 2024, 09:01 PM IST