తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని..పలు హామీలను అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే పలువురు ఐఏఎస్ లను మార్చడం వంటివి చేసారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. అదేవిధంగా పలు కీలక అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక డిసెంబర్ 07 తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన రోజు. సీఎం గా రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క తో పాటు మరో పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈరోజుతో సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్..ప్రజా పాలన మొదలుపెట్టాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు సచివాలయంలోకి ఎవరికీ అనుమతి ఉండదనే ఫీలింగ్ లో ఉన్న ప్రజలకు భరోసా కలిపిస్తే మొదటిరోజే సచివాలయ తలుపులు తెరిచారు. ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలు తొలగించారు. అంతే కాదు ప్రగతి భవన్ ను కాస్త ప్రజా దర్బార్ గా పేరు మార్చేశారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలు సమస్యలు తెలుసుకునే పని చేపట్టారు సీఎం రేవంత్. ఆ తర్వాత ప్రజా దర్బార్ ను ప్రజా వాణి గా మార్చేశారు. దానికి ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమించారు సీఎం. మంగళవారం , శుక్రవారం ప్రజల సమస్యలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరిస్తూ వస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీ హామీల్లో కీలకమైన ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల్లో నమ్మకం పెంచారు. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ప్రజల నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం మీద ఈ నెల రోజుల్లో రేవంత్ అందర్నీ చేత మంచి మార్కులు వేసుకున్నాడు.
Read Also : TDP : అరాచక ప్రభుత్వానికి ముంగింపు పలకాలి.. తిరువూరు సభలో చంద్రబాబు