KTR Birthday: కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్ధించారు.

Published By: HashtagU Telugu Desk
Ktr Birthday

Ktr Birthday

KTR Birthday: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్ధించారు. ఇక తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరువురి ఇలా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం మంచి సంప్రదాయంగా కనిపిస్తుంది.

KTR Birthday

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వేడుకలు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల్లో కేటీఆర్ ఫొటోలకి పాలాభిషేకం చేస్తున్నారు. లండన్ లోనూ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఎన్నారై బీ.ఆర్.యస్ ఆద్వర్యం లో జరిగిన వేడుకల్లో అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ కెటిఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరారు. ఇక కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పటోళ్ల కార్తీక్ రెడ్డి, క్రిషాంక్ తదితరులు ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనను విష్ చేసిన వారందరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.

కేటీఆర్ 1976 జూలై 24 న సిద్ధిపేటలో జ‌న్మించారు. కేటీఆర్ న్యూయార్క్ యూనివ‌ర్సిటీలో పట్టభద్రుడు కాగా పుణెలో బ‌యోటెక్నాల‌జీలో డిగ్రీ సాధించారు. 2006 లో తండ్రి స్థాపించిన టిఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీ ప్రభుత్వంలో కేటీఆర్ ఐటీ, వాణిజ్య‌ శాఖగా మంత్రిగా క్యాబినెట్ మంత్రి హోదాలో ప‌నిచేశారు. ఆయన సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటారు.

Also Read: Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి

  Last Updated: 24 Jul 2024, 12:57 PM IST