CM Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసినందుకు సంబంధించిన పత్రికా కథనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా విచారం వ్యక్తం చేశారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం ఉందని, దానిపై పూర్తి విశ్వాసం ఉందని సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన మాటలను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టుగా వక్రీకరించారని, ఆయా పత్రికల్లో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని సీఎం రేవంత్ సుప్రీంకు తెలిపారు.
“భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యున్నత గౌరవం మరియు పూర్తి విశ్వాసం ఉంది. పత్రికా నివేదికలలో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయవ్యవస్థ మరియు దాని స్వతంత్రత పట్ల నాకు బేషరతుగా గౌరవం ఉందని సీఎం చెప్పారు. భారత రాజ్యాంగం మరియు దాని నీతిపై దృఢంగా విశ్వసించే వ్యక్తిగా, నేను న్యాయవ్యవస్థను దాని అత్యున్నత గౌరవాన్ని కొనసాగిస్తున్నాను అని ఆయన X లో పోస్ట్ చేశారు.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగస్టు 29వ తేదీ గురువారం సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన డీల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. “ఇది ఒక సిఎం స్థాయి వ్యక్త చేయవలసిన ప్రకటనా, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు మేము బెయిల్ ఇస్తామా అంటూ” అని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి ప్రకటనలు ప్రజల మనస్సులలో భయాందోళనలను కలిగిస్తాయని అన్నారు. అయితే తన ఆదేశాలపై వచ్చిన విమర్శల వల్ల ఇబ్బంది లేదని కోర్టు పేర్కొంది. మా మనస్సాక్షి ప్రకారం మేము మా కర్తవ్యం నిర్వర్తిస్తాం. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ధర్మాసనం పేర్కొంది.చట్టసభల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకపోతే తమ నుంచి కూడా అదే జరుగుతుందని బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది.
Also Read: Vistara – Air India: విస్తారా – ఎయిర్ ఇండియా విలీనంకు కేంద్రం ఆమోదం