Site icon HashtagU Telugu

Free Sand : సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Free Sand

Free Sand

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Construction of Indiramma Houses)లో భాగంగా అవసరమైన ఇసుకను ఉచితంగా (Free Sand) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి 24 గంటలపాటు స్లాట్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నట్లు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ప్రకటించారు. దీనిద్వారా లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇసుకను పొందవచ్చు.

Ramadan : ముస్లిం ఉద్యోగులకు రేవంత్ గుడ్‌న్యూస్

అటు ఇసుక సరఫరా తక్షణమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు సులభంగా తమ అవసరమైన ఇసుకను పొందగలరని శ్రీధర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రజలకు భారం కాకుండా చూడడం ప్రభుత్వ లక్ష్యమని , ఇందులో భాగంగానే ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇసుక సరఫరాలో పారదర్శకత తీసుకురావడానికి ముఖ్యమంత్రి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేయనుంది. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

New Ration Carts : ఎన్నికల కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డులు : సీఎం రేవంత్‌ ఆదేశం

ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలపై ప్రజలు కూడా స్పందించి ఫిర్యాదులు చేయవచ్చు. అక్రమ రవాణాపై సమాచారం అందించేందుకు 9848094373, 7093914343 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రజల సహకారంతోనే అక్రమ రవాణాపై సమర్థమైన నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ఉచిత ఇసుక పథకం లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఆర్థిక భారం తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ఇసుకను అందుకోవడానికి లబ్ధిదారులు అవసరమైన ధృవపత్రాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో అందరికీ న్యాయంగా, సమర్ధవంతంగా ఇసుక అందుబాటులోకి రావడమే కాకుండా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.