Site icon HashtagU Telugu

CM Revanth Reddy : పెట్టుబడుల కోసం అమెరికా కు సీఎం రేవంత్ రెడ్డి

Transgenders for traffic control: CM orders to officials

Transgenders for traffic control: CM orders to officials

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా కు పయనం (America Tour) అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టె సంస్థలు తక్కువయ్యాయి. దీంతో చాలామంది ఇబ్బందులకు గురి అవుతున్నారు..అంతే కాకుండా రాష్ట్ర ఖజానాకు కూడా ఇబ్బందిగా మారడంతో సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికాలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం అమెరికాలో పర్యటించబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరనుంది. అమెరికా లోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలో రేవంత్ టీం ఉండనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వివరించనుంది.

Read Also : Ravindra Jadeja: జడేజా వన్డే కెరీర్ పై నీలినీడలు..!