Hyderabad : హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే – సీఎం రేవంత్ రెడ్డి

  • Written By:
  • Publish Date - February 18, 2024 / 04:46 PM IST

గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని చంద్రబాబు (Chandrababu), వైఎస్ఆర్ (YCR), కేసీఆర్ (KCR) ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ఆదివారం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వర్టర్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని , ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదని విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తారని అన్నారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడం లో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమని , ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం కచ్చితంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అలాగే గత 30 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదిస్తే దాన్ని వైఎస్ ఆర్ పూర్తి చేశారని తెలిపారు. హైదరాబాద్ కు త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి, దాని వెంట ట్రైన్ సదుపాయం కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ తో రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా 2050 మెగా మాస్టర్ ప్లాన్ దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

Read Also : Voter ID: ఓటర్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా.. అయితే ఈ సింపుల్ టిప్స్ తో ఈజీగా మార్చుకోండిలా?