CM Revanth participated in Ganesh immersion ceremony : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పాల్గొన్నారు. నవరాత్రులు విశేషమైన పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు (Khairatabad Ganesh) గంగమ్మ ఒడికి మరికాసేపట్లో చేరబోతున్నాడు. ఉదయం 7 గంటలకు కమిటీ సభ్యులు పూజలు పూర్తి చేసి..శోభాయాత్ర (Ganesh Shobhayatra) ప్రారంభించారు. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకున్నాడు. అనుకున్న సమయానికి ముందే నిమజ్జనం జరగబోతుంది.
గణనాథుడి శోభాయాత్రలో సీఎం రేవంత్ పాల్గొంటున్నారు. వినాయకుడు ఊరేగింపు సెక్రటేరియట్ వద్దకు రాగానే ఆయన అందులో భాగమయ్యారు. అక్కడి నుంచి ట్యాంక్బండ్ (Tank Bund) వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్-4 వద్దకు భక్తులతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖైరతాబాద్ శోభాయాత్రలో రాష్ట్ర సీఎం పాల్గొనడం ఇదే తొలిసారి. మరోవైపు రేవంత్ పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ గణపయ్య..ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి గా దర్శనం ఇచ్చారు.మండపైనే స్వామికి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఆదివారం సుమారు 3 లక్షల మందికి పైగా స్వామి వారిని దర్శించుకున్నట్టు కమిటీ సభ్యులు వివరించారు. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి భక్తులు వచ్చారని తెలిపారు.
ఇక ట్యాంకుబండ్ ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతుంది. శోభాయాత్రను చూసేందుకు నగరవాసులు కాదు..ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం నుండే ఆ పరిసర ప్రాంతాలు ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వందలాది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు.
Read Also : Balapur Laddu : బాలాపూర్ లడ్డు ఈఏడాది ఎంత పలికిందంటే..